
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని ఇప్పటికీ సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ .. తాను అద్దెకున్న ముంబైలోని బాంద్రాలోని మోంట్ బ్లాంక్ అపార్ట్‌మెంట్స్‌లో 2020లో సూసైడ్ చేసుకున్నాడు. అప్పటినుంచి ఆ ప్లాట్ ను ఎవరూ కొనలేదు. సుశాంత్ సూసైడ్ తరువాత ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపించారని.. కానీ ఆ ఇంటి యజమాని దానిని అద్దెకు ఇవ్వడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నారని అక్కడి రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒకరు తెలిపారు.
అయితే ఇటీవల ఆ ప్లాట్ ను ది కేరళ స్టోరీ ఫేమ్ అదా శర్మ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పోస్ట్‌ను బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ 14న బాంద్రాలోని తన ఫ్లాట్‌లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సముద్రానికి ఎదురుగా ఉన్న ఫ్లాట్ అద్దెకు తీసుకున్న సుశాంత్ నెలకు రూ.4.5 లక్షలు రెంట్ చెల్లించేవాడట. ఎంఎస్ ధోని సినిమాతో యావత్ దేశవ్యాప్తంగా సినీ ప్రియుల హృదయాలను గెలుచుకున్న సుశాంత్.. సూసైడ్ చేసుకుని అందరిని షాక్ కు గురిచేశాడు.
ఇక ఇటీవల ది కేరళ స్టోరీ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చిందిఆదాశర్మ ... ఎన్నో వివాదాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. కేరళలో జరిగిన అమ్మాయిల మిస్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ సినిమా ఆదా శర్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.