
‘ది కేరళ స్టోరీ(The kerala story)’ విడుదలై కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అదే స్థాయిలో ఈ సినిమాపై వివాదాలు కూడా చెలరేగాయి. కొందరు సినీ నటులు సైతం తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. సీనియర్ హీరో కమల్ హాసన్(Kamal haasan) గతంలో కేరళ స్టోరీపై బోల్డ్ కామెంట్స్ చేశాడు. ఇలాంటి ప్రచార చిత్రాలు తనకు నచ్చవన్నాడు. టైటిల్ కింద రియల్ స్టోరీ అని పెట్టగానే సరిపోదని వాస్తవాలను చూపాలంటూ ఘాటుగానే స్పందించారు.
ALSOREAD:నటనపై ఎఫెక్ట్ పడుతుందని దూరం పెట్టాడట
మరోవైపు బాలీవుడ్ నటుడు నజీరుద్దీన్ షా(naseeruddin shah) సైతం ఈ సినిమా తనకు నచ్చలేదని వెల్లడించాడు. తాజాగా హీరోయిన్ అదా శర్మ(Adah sharma) ఈ విమర్శలపై నోరు విప్పింది. కొందరు సినిమా చూడకుండానే దీనిపై మాట్లాడారని.. అలాంటి కామెంట్లు తనను బాధించవని తెలిపింది. ఈ దేశంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంది.. మన దేశం భిన్న మనుషుల, మనసుల కలయిక. అలాంటి దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటూ చెప్పొకొచ్చింది.