నటనపై ఎఫెక్ట్ పడుతుందని దూరం పెట్టాడట

నటనపై ఎఫెక్ట్ పడుతుందని దూరం పెట్టాడట

జాన్వీ కపూర్​(Janhvi kapoor) ‘బవాల్(Bawal)’​ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ ప్రమోషన్స్​లో భాగంగా ఈ  బ్యూటీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాలో స్టూడెంట్​ ఆఫ్​ ది ఇయర్​ ఫేమ్​ వరుణ్​ ధావన్​(Varun dhavan)తో జాన్వీ జోడీకట్టింది. అయితే,  సినిమా షూటింగ్​ సమయంలో ఓ ఇంట్రెస్టింగ్​ సీన్​ జరిగిందట. వరుణ్​ ధావన్​ జాన్వీతో కలిసి నటించడం ఇదే మొదటి సారి. దీంతో సెట్​లో వీరిద్దరూ కలిసిపోతారని మూవీ టీం భావించింది.

ALSOREAD:బాలీవుడ్ స్టార్కు ఆదా సాలిడ్ కౌంటర్ 

కానీ, వరుణ్​ జాన్వీని అవాయిడ్​ చేసేవాడట. తను మాట్లాడే ప్రయత్నం చేసినా పెద్దగా కలిసేవాడు కాదట. ఇలా నెల రోజుల వరకు జరిగింది. ఈ విషయాన్ని ఈ హీరో స్వయంగా చెప్పాడు. సినిమాల్లో వీరి పాత్రల స్వభావం ప్రత్యేకంగా ఉంటుందట. చలాకీ వ్యక్తులైన వీరిద్దరూ ఒక చోట చేరితే మంచి స్నేహితులైపోతారు.. అప్పుడు తమ నటనపై ఆ ఎఫెక్ట్​ ఉంటుందని హీరో భావించాడట. అందుకే జాన్వీ ఏమనుకున్నా పరవాలేదనుకుని తనను దూరం పెట్టినట్టు చెప్పాడు.