ఐఏఎన్‌‌‌‌ఎస్‌‌‌‌లో వాటాను పెంచుకున్న అదానీ

ఐఏఎన్‌‌‌‌ఎస్‌‌‌‌లో వాటాను పెంచుకున్న అదానీ

 న్యూఢిల్లీ : అదానీ గ్రూప్   న్యూస్ ​ఏజెన్సీ ఐఏఎన్​ఎస్​లో వాటాను మరింత పెంచుకుంది. ఇది మొదట 50.50 శాతం వాటాను కైవసం చేసుకుంది. తాజాగా ఓటింగ్ హక్కులతో 76 శాతానికి, ఓటింగ్ హక్కులు లేకుండానే 99.26 శాతానికి వాటాను పెంచుకుంది.  మంగళవారం జరిగిన సమావేశంలో షేర్ల కేటాయింపును ఐఏఎన్​ఎస్​ బోర్డు ఆమోదించింది. అదానీ గ్రూప్ గత ఏడాది డిసెంబర్ 15న ఐఏఎన్‌‌‌‌ఎస్‌‌‌‌లో 50.50 శాతం వాటాను దక్కించుకుంది. ఇప్పుడు అదనంగా 25.50 శాతం ఈక్విటీ షేర్లను ఓటింగ్ హక్కులతో దక్కించుకుంది. 

ఓటింగ్ హక్కులు లేకుండానే 99.26 శాతం వాటాను తీసుకునేందుకు అదనంగా 48.76 శాతం ఈక్విటీ షేర్లను కొన్నది. ఐఏఎన్​ఎస్​ అధీకృత వాటా మూలధనం రూ. 11 కోట్లు కాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.86 కోట్ల ఆదాయం వచ్చింది.  ఐఏఎన్​ఎస్ ఏఎంజీ మీడియా నెట్​వర్క్స్​( ఏఎంఎన్​ఎల్)  అనుబంధ సంస్థ అవుతుందని ఫైలింగ్‌‌లో  పేర్కొంది. అదానీకి బీక్యూ ప్రైమ్​, ఎన్​డీటీవీలోనూ వాటాలు ఉన్నాయి.