దేశపు ఇమేజ్​పై అదానీ ఎఫ్​పీఓ ఎఫెక్ట్​ లేదు : నిర్మలా సీతారామన్​

దేశపు ఇమేజ్​పై అదానీ ఎఫ్​పీఓ ఎఫెక్ట్​ లేదు : నిర్మలా సీతారామన్​

ముంబై: అదానీ గ్రూప్​ తన ఎఫ్​పీఓను కాన్సిల్​ చేసుకున్న ఎఫెక్ట్​ మన దేశపు ఇమేజ్​ మీద ఏమీ పడలేదని ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ చెప్పారు. కిందటి రెండు రోజులలోనే మన ఫారెక్స్​ రిజర్వులు 8 బిలియన్​ డాలర్ల మేర పెరిగాయని పేర్కొన్నారు. అదానీ గ్రూప్​ ఎపిసోడ్​ వల్ల  మన దేశపు మాక్రో ఎకనమిక్​ ఫండమెంటల్స్​, ఎకానమీ ఇమేజ్​పై ఎలాంటి ప్రభావమూ పడలేదని వెల్లడించారు.  యూఎస్​ షార్ట్​ సెల్లర్​ ఆరోపణల నేపథ్యంలో ఎఫ్​పీఓ డబ్బు  రూ. 20 వేల కోట్లను ఇన్వెస్టర్లకు వాపసు చేయాలని అదానీ గ్రూప్​ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎఫ్​పీఓలు వస్తూనే ఉంటాయి....ఎఫ్​ఐఐలు బయటకు వెళ్తూనే ఉంటాయని మీడియాతో నిర్మలా సీతారామన్​ అన్నారు. అన్ని మార్కెట్లలోనూ హెచ్చు–తగ్గులు ఉంటాయని, కానీ రెండు రోజులలో పెరిగిన ఫారెక్స్​ రిజర్వులు మన ఎకానమీ పటిష్టంగా ఉందనేది తెలియజేస్తాయని పేర్కొన్నారు. అదానీ గ్రూప్​పై వచ్చిన ఆరోపణల గురించిన ప్రశ్నకు, దేశంలోని ఫైనాన్షియల్​ సెక్టార్​ రెగ్యులేటర్లు ఇండిపెండెంట్​గా తమ పని తాము చేస్తాయని స్పష్టం చేశారు. మార్కెట్లలో స్టెబిలిటీ తెచ్చేందుకు అవసరమైన అన్ని అధికారాలూ సెబీకి ఉన్నాయని చెప్పారు. అదానీ గ్రూప్​ అప్పులపై ఆర్​బీఐ ఇప్పటికే ఇచ్చిన వివరణనూ ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్​ ప్రస్తావించారు. అదానీ కాంట్రావర్సీ టీ కప్పులో తుపాను లాంటిదనే తన కామెంట్​కు కట్టుబడి ఉన్నట్లు ఫైనాన్స్​ సెక్రటరీ టీ వీ సోమనాథన్​ చెప్పారు. మాక్రో ఎకనమిక్​ కోణంలో మాత్రమే తాను ఆ కామెంట్​ చేశానని వివరణ ఇచ్చారు. 

పాత ట్యాక్స్​ పద్ధతి​ కొనసాగుతుంది....

పాత ట్యాక్స్​ పద్ధతి​ నిలిపి వేయాలనే నిర్ణయమేదీ తీసుకోలేదని, సులభంగా ఉండటంతోపాటు కొన్ని ఇన్సెంటివ్స్​, తక్కువ రేట్లతో కొత్త పద్ధతి తీసుకొచ్చామని నిర్మలా సీతారామన్​ చెప్పారు. కొత్త పద్ధతి వల్ల  సేవింగ్స్​ తగ్గుతాయనే విమర్శలను ప్రభుత్వాధికారులు తిరస్కరించారు. బడ్జెట్​ తర్వాత ముంబైలో జరిగిన ఒక మీటింగ్​లో ఫైనాన్స్​ మినిస్టర్​ సహా డిపార్ట్​మెంట్​ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.