ఖవ్దా రెన్యూవబుల్​ ఎనర్జీ పార్క్​

ఖవ్దా రెన్యూవబుల్​ ఎనర్జీ పార్క్​

అదానీ గ్రీన్​ ఎనర్జీ లిమిటెడ్​ (ఏజీఈఎల్​) గుజరాత్​లోని ఖవ్దా ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్ద పునరుత్పాదక ఇంధన పార్కును స్థాపించింది. ఇది ప్రధానంగా సౌరశక్తి ఆధారితమైన 45 జీడబ్ల్యూ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 
-     ఈ ప్రాంతం లడఖ్​ తర్వాత దేశంలో రెండో అత్యుత్తమ సౌర వికిరణాన్ని, మైదాన ప్రాంతాల్లో ఉండే గాలి వేగం కంటే ఐదు రెట్లు 
ఎక్కువగా ఉంది. 
-     పాకిస్తాన్ కు కేవలం ఒక కిలోమీటర్​ దూరంలో ఉన్న ఈ ఎనర్జీ పార్క్​ను బఫర్​ 
జోన్​గా సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) నిర్వహిస్తుంది. 
-     ఈ ప్రాంతం ప్రస్తుతం క్లీన్​ ఎనర్జీ వెంచర్​ కోసం సిద్ధమైంది. ఇది 538 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తీర్ణంలో అంటే పారిస్​ కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. ఈ పార్క్​ గరిష్టంగా 81 బిలియన్​ యూనిట్ల విద్యుత్​ను అంటే బెల్జియం, చిలీ, స్విట్జర్లాండ్​ వంటి దేశాలకు మొత్తం సరిపడే విద్యుత్​ శక్తిని ఉత్పత్తి చేయగలదని అంచనా. 30 మెగావాట్ల క్లీన్​ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి అదానీ గ్రీన్​ ఎనర్జీ లిమిటెడ్​ (ఏజీఈఎల్​) సుమారు రూ.1.50లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది.