అదానీ గ్రూప్ చైర్మన్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

అదానీ గ్రూప్ చైర్మన్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి కేంద్రం జెడ్ కేటగిరి భద్రత కల్పించనుంది. సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు రక్షణగా ఉండనున్నారు. అదానీకి ముప్పు పొంచివుందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా భద్రత కల్పిస్తున్నందుకు ఆయన నెలకు 15 నుంచి 20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 

అదానీ సెక్యూరిటీ బాధ్యతలను చూసుకోవాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఇప్పటికే సీఆర్పీఎఫ్ను కోరినట్లు తెలుస్తోంది. దీంతో సీఆర్పీఎఫ్ రంగంలోకి దిగిందని సమాచారం. మరో వ్యాపార దిగ్గజం అయిన ముఖేష్ అంబానీకి 2013 నుంచి కేంద్రం జెడ్ ప్లస్ భద్రతను అందిస్తోంది. ఆ తర్వాత అతడి సతీమణి నీతా అంబానీకి కూడా కొంచెం తక్కువ స్థాయిలో భద్రతను అందిస్తున్నారు.