జైప్రకాష్ అసోసియేట్స్‌‌ను కొనేందుకు అదానీ గ్రూప్ గ్రీన్ సిగ్నల్

జైప్రకాష్ అసోసియేట్స్‌‌ను కొనేందుకు అదానీ గ్రూప్ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: అప్పుల్లో కూరుకుపోయిన జైప్రకాష్ అసోసియేట్స్‌‌ను అదానీ గ్రూప్​కొనుగోలు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మంగళవారం తెలిపింది. ప్రస్తుతం నడుస్తున్న దివాలా ప్రక్రియలో అదానీ గ్రూప్​ బిడ్​ గెలిస్తే ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్​(జేఏఎల్)లో 100 శాతం వాటాలను అదానీ ఎంటర్‌‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్), అదానీ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఐడీపీఎల్) లేదా అదానీ గ్రూప్‎లోని ఏ ఇతర సంస్థ అయినా కొనుగోలు చేయొచ్చని సీసీఐ తెలిపింది. 

సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం, రిజల్యూషన్ ప్లాన్‌‌ను సమర్పించడానికి సీసీఐ నుంచి అనుమతి తప్పనిసరి. జేఏఎల్ కమిటీ ఆఫ్​ క్రెడిటార్స్​(సీఓసీ) రిజల్యూషన్ ప్లాన్‌‌లను సమీక్షిస్తోంది. త్వరలో ఓటింగ్ జరుగుతుంది. అదానీ గ్రూప్​తో పాటు డాల్మియా భారత్​ ప్రతిపాదనకు కూడా రెగ్యులేటర్ ఆమోదం తెలిపింది. వేదాంత గ్రూప్​, జిందాల్ పవర్, పీఎన్‌‌సీ ఇన్‌‌ఫ్రాటెక్‌‌తో సహా ఇతర కంపెనీలు సైతం తమ రిజల్యూషన్ ప్లాన్‌‌లను సమర్పించడానికి సీసీఐ ఆమోదం కోరాయి.