అదానీ గ్రూప్ నికరలాభం రూ.40,655 కోట్లు

అదానీ గ్రూప్ నికరలాభం రూ.40,655 కోట్లు
  • ఇబిటా రూ.90 వేల కోట్లు 
  • స్థూల ఆస్తుల విలువ రూ.6,09,133 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియో కంపెనీలు మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.90 వేల కోట్ల పన్ను చెల్లింపునకు ముందు లాభాన్ని (ఇబిటా) సాధించాయి.  రూ.40,655 కోట్ల నికరలాభం వచ్చింది. 21 నెలల అప్పులను తీర్చడానికి అవసరమైనంత నగదు నిల్వలు ఉన్నాయని కంపెనీ గురువారం తెలిపింది. వడ్డీ, పన్నులు, తరుగుదల, అప్పుల చెల్లింపునకు ముందు ఆదాయాలు (ఇబిటా) ఆరు సంవత్సరాలలో మూడు రెట్లు  పెరిగాయి. 

- 2018–-19లో రూ.24,870 కోట్ల నుంచి 2024-–25లో రూ.89,806 కోట్లకు పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.82,976 కోట్ల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.89,806 కోట్లకు పెరిగింది.  ఆరేళ్లలో కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 24 శాతం ఉందని కంపెనీ ప్రకటించింది. స్థూల ఆస్తుల విలువ రూ.609,133 లక్షల కోట్లకు పెరిగింది. ఆరేళ్ల సీఏజీఆర్ 25 శాతానికి పైగా ఉంది. విమానాశ్రయాల నుంచి పునరుత్పాదక ఇంధన పార్కుల వరకు భారీగా ఖర్చు చేస్తున్న ఈ గ్రూప్, స్థూల అప్పు 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2.41 లక్షల కోట్ల నుంచి రూ.2.9 లక్షల కోట్లకు పెరిగింది. రూ.53,843 కోట్ల నగదు నిల్వను లెక్కలోకి తీసుకుంటే నికర అప్పు 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.2.36 లక్షల కోట్లకు తగ్గుతుంది.  

భారీగా పెరిగిన ఆర్​ఓఏ

2025 ఆర్థిక సంవత్సరంలో రిటర్న్​ ఆన్​ అస్సెట్​(ఆర్​ఓఏ) 16.5 శాతానికి చేరుకుంది.   ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాల సంస్థలలో ఇదే అత్యధికమని అదానీ గ్రూపు పేర్కొంది. 2025 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలో అత్యధికంగా 16.5 శాతం ఆర్​ఓఏ వచ్చిందని పేర్కొంది.  అదానీ  'కోర్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్' ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లో యుటిలిటీ (అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్  అదానీ టోటల్ గ్యాస్), రవాణా (అదానీ పోర్ట్స్, సెజ్​),  అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ లిమిటెడ్ మౌలిక సదుపాయాల వ్యాపారాలు ఉన్నాయి. ఈసారి పన్ను తర్వాత నగదు లేదా కార్యకలాపాల నుంచి నిధుల ప్రవాహం రూ. 66,527 కోట్లకు పెరిగింది.  

మొత్తం స్థూల ఆస్తుల విలువ రూ. 6.1 లక్షల కోట్లుగా రికార్డయింది.  గ్రూప్ సోలార్​ మాడ్యూల్ అమ్మకాలు సంవత్సరానికి 59 శాతం పెరిగి 4,263 మెగావాట్లకు చేరుకోగా, అదానీ విమానాశ్రయాలలో ప్రయాణీకుల సంఖ్య 7 శాతం పెరిగి 9.44 కోట్ల మందికి చేరుకుంది.  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ లైన్ ఆర్డర్ బుక్ 3.5 రెట్లు పెరిగి రూ. 59,936 కోట్లకు చేరుకుంది.  అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 2025 ఆర్థిక సంవత్సరంలో ఏడు కొత్త ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ ప్రాజెక్టులను గెలుచుకుంది. 

అదానీ పోర్ట్స్ వాల్యూమ్‌‌‌‌‌‌‌‌లు 7 శాతం పెరిగి 450 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి.  సిమెంట్ వ్యాపారం 100 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని దాటింది. ఇదిలా ఉంటే,  అప్పుల చెల్లింపు కోసం ప్రైవేట్ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రాతిపదికన డిబెంచర్లను జారీ చేయడం ద్వారా రూ.6,000 కోట్ల వరకు సేకరించే ప్రతిపాదనను తమ బోర్డు ఆమోదించినట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీసెజ్​) గురువారం తెలిపింది.