మార్కెట్​కు లాభాలే..లాభాలు.. అదానీ గ్రూప్ @ రూ.13 లక్షల కోట్లు

మార్కెట్​కు లాభాలే..లాభాలు.. అదానీ గ్రూప్ @ రూ.13 లక్షల కోట్లు

ముంబై:  బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మంగళవారం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త గరిష్టాలను టచ్ చేశాయి. కీలక రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో మార్కెట్ లాభాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 431 పాయింట్లు  పెరిగి 69,296 దగ్గర ముగిసింది. నిఫ్టీ 168 పాయింట్లు ఎగిసి 20,855 దగ్గర సెటిలయ్యింది. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీసీ షేర్లు 4 శాతం చొప్పున ర్యాలీ చేసి, టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎం అండ్ ఎం, టైటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మారుతి షేర్లు కూడా పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా క్లోజయ్యాయి. హిందుస్తాన్ యూనిలీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బజాజ్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విప్రో షేర్లు మాత్రం నష్టపోయాయి. 

సెక్టార్ల పరంగా చూస్తే, నిఫ్టీ మెటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3 శాతం పెరగగా,  నిఫ్టీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆయిల్ అండ్ గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ, ఐటీ, మీడియా, రియల్టీ, హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నష్టాల్లో క్లోజయ్యాయి. నిఫ్టీ స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ 100 ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కొత్త ఆల్ టైమ్ హై లెవెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమోదు చేశాయి. ఇన్వెస్టర్ల సంపద మంగళవారం రూ.2.4 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. 346.51 లక్షల కోట్లకు చేరుకుంది. 

నిపుణుల  మాట

‘కీలక రాష్ట్రాల్లో బీజేపీ గెలవడంతో పాటు అంచనాలను మించిన కంపెనీల ఫలితాలు, జీడీపీ గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి పాజిటివ్ అంశాలు కూడా మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరగడానికి కారణమవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రావడం కలిసొచ్చింది. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ వడ్డీ రేట్లను మార్చదనే అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ, ఆర్థిక వ్యవస్థ వృద్ధి, ఆహార పదార్థాల ధరలు, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ చేసే కామెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్కెట్ జాగ్రత్తగా గమనిస్తుంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఓవర్ బాట్ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మంళవారం హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పరిచాయని ప్రోగ్రెసివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదిత్య గగ్గర్ పేర్కొన్నారు. మార్కెట్ పడొచ్చని, 20,700 లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిగువకు వస్తేనే ట్రెండ్ రివర్స్ అయ్యిందని చెప్పగలమని వివరించారు. 

చైనా మార్కెట్ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఏషియన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మంగళవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. ప్రాపర్టీ, టెక్నాలజీ షేర్లలో  అమ్మకాల ఒత్తిడి కనిపించింది. చైనీస్ ఎకానమీపై ఆందోళనలు నెలకొనడంతో  హాంకాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2.4 శాతం, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  1.7 శాతం పడ్డాయి. యూరోపియన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ట్రేడయ్యాయి. 

ఆయిల్ ధరలు..

ఆయిల్ ధరలు  మంగళవారం దిగొచ్చాయి.  చైనా ఎకానమీపై ఆందోళనలు పెరగడంతో ఆయిల్ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అనిశ్చితి నెలకొంది. బ్రెంట్ క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 78.03 డాలర్ల దగ్గర  ట్రేడవుతోంది. డాలర్ మారకంలో రూపాయి 83.38 దగ్గర సెటిలయ్యింది. 

అదానీ గ్రూప్ @ రూ.13 లక్షల కోట్లు

 రెండు సెషన్లలోనే 30 శాతం వరకు పెరిగిన అదానీ గ్రూప్ షేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలిచ్చాయి. అదానీ  కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.13 లక్షల కోట్లను దాటింది. హిండెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ రిపోర్ట్ తర్వాత  గ్రూప్ కంపెనీల మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాప్ రూ.13 లక్షల కోట్ల మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టచ్ చేయడం ఇదే మొదటిసారి. అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ షేర్లు   మంగళవారం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 17 శాతం పెరిగాయి. అదానీ పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  15 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అదానీ టోటల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్లు 20 శాతం లాభపడి అప్పర్ సర్క్యూట్ టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాయి. అదానీ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15 శాతం, అదానీ విల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 శాతం లాభపడ్డాయి. ఏసీసీ, అంబుజా సిమెంట్స్ షేర్లు 8 శాతం వరకు  పెరగగా, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీటీవీ షేర్లు 18 శాతం ఎగిశాయి.   మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్​ రాష్ట్రాల్లో బీజేపీ గెలవడంతో అదానీ షేర్లకు రెక్కలొచ్చాయని ఎనలిస్టులు అంటున్నారు.