అంబుజాలో అదానీకి మరింత వాటా .. డీల్ ​విలువ రూ.8,339 కోట్లు

అంబుజాలో అదానీకి  మరింత వాటా .. డీల్ ​విలువ రూ.8,339 కోట్లు
  • 70 శాతానికి చేరిక

న్యూఢిల్లీ: తాజాగా రూ.8,339 కోట్ల ఇన్వెస్ట్​మెంట్​తో అదానీ కుటుంబం అంబుజా సిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాటాను 70.3శాతానికి పెంచుకుంది. బిలియనీర్ గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం అంబుజా సిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అదనంగా రూ.8,339 కోట్లను పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది,  అక్టోబర్ 18, 2022న రూ.5,000 కోట్లు,  మార్చి 28, 2024న రూ.6,661 కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ తర్వాత తాజా పెట్టుబడి వచ్చింది.  అదానీ కుటుంబం మొత్తం రూ.20 వేల కోట్లను మదుపు చేయడం ద్వారా కంపెనీలోని వారెంట్ల ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పూర్తిగా సభ్యత్వాన్ని పొందిందని అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ హోల్ టైమ్ డైరెక్టర్,  సీఈఓ అజయ్ కపూర్ అన్నారు. 

2028 ఆర్థిక సంవత్సరం నాటికి భారతీయ సిమెంట్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాటాను దాదాపు ఐదవ వంతుకు పెంచుకుంటామని అదానీ ఇదివరకే ప్రకటించింది. 2022లో గ్లోబల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి రుణాలు తీసుకొని అదానీ అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, ఏసీసీ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నియంత్రణ వాటాను  10.5 బిలియన్​ డాలర్లకు కొనుగోలు చేసింది. యూఎస్​-ఆధారిత షార్ట్-సెల్లర్ హిండెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ రీసెర్చ్ చేసిన తీవ్ర దాడినుంచి కోలుకున్న తర్వాత బార్​క్లేస్​, బ్యాంక్ , డాయిష్​బ్యాక్​, స్టాండర్డ్ చార్టర్డ్ లోన్లను గత సంవత్సరం రీఫైనాన్స్ చేసింది.