Gautham Adani: ప్రపంచ కుబేరుల్లో టాప్20లో కూడా లేని అదానీ

Gautham Adani: ప్రపంచ కుబేరుల్లో టాప్20లో కూడా లేని అదానీ

హిడెన్ బర్గ్ అదానీ గ్రూప్ పై ఇచ్చిన నివేదికతో భారత స్టాక్ మార్కెట్లు వనుకుతున్నాయి. నిన్న కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలోనే రూ.10 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకటిగా ఉన్న అదానీ గ్రూప్ విలువలు రూ. 4లక్షల కోట్లు పోగొట్టుకున్నాడు. ఈ దెబ్బతో ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఒక్కసారిగా 21వ స్థానానికి పడిపోయాడు. 61.3 బిలియన్ డాలర్ల సంపదతో 21వ స్థానానికి కొనసాగుతున్నాడు. అదానీ గ్రూప్‌కు చెందిన అన్ని కంపెనీల షేర్లు పతనమౌతున్నాయి. గ్రూప్ మూల కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ విలువ దాదాపు 60 శాతం పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ 80.3 బిలియన్ డాలర్లతో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు.