సీఎన్‌జీ ధరలు తగ్గించిన అదానీ టోటల్‌

సీఎన్‌జీ ధరలు తగ్గించిన అదానీ టోటల్‌

కొన్ని సిటీల్లో పీఎన్‌‌‌‌‌‌‌‌‌‌జీ రేట్లలో కూడా కోత

న్యూఢిల్లీ : సీఎన్‌‌‌‌జీ, పీఎన్‌‌‌‌జీ ధరలను అదానీ టోటల్‌‌‌‌ గ్యాస్ శనివారం తగ్గించింది.  సీఎన్‌‌‌‌జీ  ధరను కేజీపై రూ. 8.13 వరకు  తగ్గించగా,  పీఎన్‌‌‌‌జీ (పైప్డ్‌‌‌‌ వంట గ్యాస్‌‌‌‌) పై కేజీకి రూ. 5.06 వరకు కోత పెట్టింది. ప్రభుత్వం నేచురల్ గ్యాస్‌‌‌‌ ధరలను సవరించిన విషయం తెలిసిందే. ఫలితంగా  సీఎన్‌‌‌‌జీ, పీఎన్‌‌‌‌జీ ధరలను కంపెనీలు తగ్గిస్తున్నాయి. కాగా, సీఎన్‌‌‌‌జీని వెహికల్స్‌‌‌‌లో వాడుతున్నారు. పైప్డ్ కుకింగ్‌‌‌‌ గ్యాస్‌‌‌‌ని ఇండ్లలో వంటకు ఉపయోగిస్తున్నారు. పీఎన్‌‌‌‌జీ రేట్లను గుజరాత్‌‌‌‌లోని వడోదర, అహ్మదాబాద్‌‌‌‌, ఇతర సిటీల్లో తగ్గించామని, అలానే ఖుజ్రా (ఉత్తర ప్రదేశ్‌‌‌‌), ఫరీదాబాద్‌‌‌‌, పల్వాల్‌‌‌‌ (హర్యాన) లలో  తగ్గించామని అదానీ టోటల్ గ్యాస్ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది.

సీఎన్‌‌‌‌జీ ధరలను మాత్రం తాము ఆపరేట్ చేస్తున్న 21 సిటీల్లో తగ్గించామని వెల్లడించింది. నేచురల్ గ్యాస్ ధరలను నిర్ణయిస్తున్న ఏపీఎం మెకానిజాన్ని  గ్యాస్‌‌‌‌ సప్లయ్‌‌‌‌కు లింక్ చేయడాన్ని ఆహ్వానిస్తున్నామని అదానీ టోటల్ గ్యాస్ పేర్కొంది.  ఇండియన్ క్రూడ్ బాస్కెట్‌‌‌‌లో 10 శాతాన్ని సీఎన్‌‌‌‌జీ వెహికల్స్‌‌‌‌కు, రెసిడెన్షియల్ హౌస్‌‌‌‌ హోల్డ్స్‌‌‌‌కు మిలియన్ బ్రిటిష్‌‌‌‌ థర్మల్‌‌‌‌ యూనిట్‌ను  4 డాలర్లకే  సప్లయ్ చేస్తామని తెలిపింది. గరిష్టంగా ఇది 6.5  డాలర్లుగా ఉంది. ప్రభుత్వం ఈ గరిష్ట ధరను   8.57 డాలర్ల నుంచి తగ్గించింది. ఈ బెనిఫిట్స్‌‌‌‌ను ప్రజలకు మళ్లిస్తున్నామని అదానీ టోటల్ గ్యాస్ ప్రకటించింది. పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ ధరలతో పోలిస్తే సీఎన్‌‌‌‌జీపై కన్జూమర్లు  40 %, ఎల్‌‌‌‌పీజీతో పోలిస్తే పీఎన్‌‌‌‌జీపై 15 % సేవ్ చేయొచ్చని వెల్లడించింది.