
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా ఫార్మా కంపెనీ అడ్‌కాక్ ఇన్‌గ్రామ్‌లో భారీ వాటాను కొంటున్నట్టు హైదరాబాద్ఫార్మా కంపెనీ నాట్కో ఫార్మా ప్రకటించింది. ఈ 4.2 బిలియన్ ర్యాండ్ల (దాదాపు రూ. 2,163 కోట్లు) డీల్ ద్వారా అడ్‌కాక్ ఇన్‌గ్రామ్ ప్రైవేట్ సంస్థగా మారుతుంది. దీనికి నాట్కో ఒక యజమాని అవుతుంది. బిడ్‌వెస్ట్ మాత్రం మెజారిటీ వాటాదారుగా కొనసాగుతుంది. ఈ కొనుగోలు ప్రతిపాదనకు అడ్‌కాక్ ఇన్‌గ్రామ్ వాటాదారులు ఆమోదం తెలిపారు.
నాట్కో ఈ ఏడాది జులైలో ఇచ్చిన ఆఫర్‌కు 98 శాతం మంది వాటాదారులు ఓటు వేశారు. వాటాల కొనుగోలు పూర్తయిన తర్వాత, అడ్‌కాక్ ఇన్‌గ్రామ్ జేఎస్ఈ నుంచి డీలిస్ట్ అవుతుంది. ఈ ఒప్పందం ద్వారా నాట్కో ఫార్మాకు దక్షిణాఫ్రికా మార్కెట్‌లోకి ప్రవేశించగలుగుతుంది. అడ్‌కాక్ ఇన్‌గ్రామ్ నాట్కోతో భాగస్వామ్యం ద్వారా పరిశోధనలపై దృష్టి సారించే ఫార్మా కంపెనీ మద్దతు ఇవ్వగలుగుతుంది. జెనరిక్స్ ప్రొడక్టుల సంఖ్యను పెంచుతుంది.