ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్‌వి నిరాధార ఆరోపణలు..సీఎంపై విమర్శలు సరికావు: అద్దంకి దయాకర్

ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్‌వి నిరాధార ఆరోపణలు..సీఎంపై విమర్శలు సరికావు: అద్దంకి దయాకర్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోగ్య విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మానవతా దృక్పథంతో వ్యవహరించినా, దానిపై ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అద్దంకి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విమర్శించారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.

సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని ఎవరో బెదిరించారంటూ ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపించారు. సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కుటుంబం ప్రస్తావించని అంశాలను ఆయనే కల్పిస్తున్నారని విమర్శించారు. ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారిగా పనిచేసిన వ్యక్తి స్వతంత్ర ఆలోచనతో వ్యవహరించాలని, ఇతరులు రాసిచ్చిన స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చదవడం సరికాదన్నారు.