
ఎమ్మెల్సీ టికెట్ రేసులో చివరి నిమిషం వరకు పోటీ పడి నిరాశకు గురైన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ స్పందించారు. టికెట్ ఆశించిన మాట వాస్తవమే అని.. ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా.. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగానే పని చేస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు జనవరి 17వ తేదీన సోషల్ మీడియా ద్వారా వీడియో రిలీజ్ చేశారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని.. పార్టీ కోసం సహనంగా ఉంటానని వెల్లడించారు.
మరింత మంచి అవకాశం ఇవ్వటానికి పార్టీ ఆలోచిస్తుందని భావిస్తున్నానని.. నా విషయంలో కేంద్ర, రాష్ట్ర పార్టీలు సానుకూలంగా ఉన్నాయని వివరించారు అద్దంకి దయాకర్. ఎమ్మెల్సీ కంటే మంచి పదవి రావొచ్చని భావిస్తున్నానని.. అప్పటి వరకు పార్టీ కోసం సహనంగా.. విధేయతగా ఉంటానని వివరించారాయన. ఎమ్మెల్సీ టికెట్ రాకపోవటంపై.. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మెద్దని.. పార్టీకి ఎప్పుడూ విధేయతగా ఉంటానని వివరించారు అద్దంకి దయాకర్.
? ??????? ??? ?????'? ????????, Party Will Accomdate me in Good Position Very Soon.
— Congress for Telangana (@Congress4TS) January 17, 2024
-- Addanki Dayakar
పార్టీ నిర్ణయమే ప్రధానం మరియు నేను దానిని అంగీకరిస్తున్నాను.
?పార్టీ నాకు త్వరలో మంచి స్థానం కల్పిస్తుంది
-- అద్దంకి దయాకర్#AddankiDayakar… pic.twitter.com/8YVtNqZfeN