ఎంజీఎంలో ఏటీఎఫ్‌‌ సెంటర్‌‌ ప్రారంభం

ఎంజీఎంలో ఏటీఎఫ్‌‌ సెంటర్‌‌ ప్రారంభం

వరంగల్‌‌, వెలుగు : లిక్కర్​, డ్రగ్స్‌‌ బారిన పడిన వారికి ట్రీట్‌‌మెంట్‌‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వ సోషల్‌‌ జస్టిస్‌‌ అండ్‌‌ ఎంపవర్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలో వరంగల్‌‌ ఎంజీఎంలో అడిక్షన్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ ఫెసిwలిటీ సెంటర్‌‌ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌‌ను గురువారం కేంద్ర మంత్రి డాక్టర్‌‌ వీరేంద్రకుమార్‌‌ వర్చువల్‌‌ పద్ధతిలో ప్రారంభించగా, కార్యక్రమానికి కలెక్టర్‌‌ ప్రావీణ్య, సీపీ అంబర్‌‌ కిశోర్‌‌ ఝా హాజరై మాట్లాడారు.

డ్రగ్స్‌‌, పొగాకు వంటివి ప్రమాదకర స్థాయిలో వినియోగంలో ఉన్నాయన్నారు. ఈ వ్యసనాలకు బానిసలుగా మారిన వారిని ఈ సెంటర్‌‌కు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్‌‌ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్‌‌ మోహన్‌‌దాస్‌‌, డాక్టర్లు శ్రీనివాస్, మురళీధర్‌‌ పాల్గొన్నారు.