కుంటాలలో చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ సీరియస్

 కుంటాలలో చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ సీరియస్
  • విచారణకు ఆదేశం

కుంటాల, వెలుగు: కుంటాల మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో వేప చెట్ల నరికివేతపై అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) ఫైజాన్​ అహ్మద్ సీరియస్ అయ్యారు. మంగళవారం చెట్ల నరికివేతపై పలువురు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన అడిషనల్ కలెక్టర్ బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జనావాసాల్లో ఎండిన భారీ వృక్షంతో ప్రమాదం పొంచి ఉందని, అందుకే నరికివేసినట్లు భూ యజమాని తెలిపారు. 

ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరికి వేయడం ఏమిటని ప్రశ్నించిన అడిషనల్​కలెక్టర్.. ఎంపీడీ ఓ, పంచాయితీ కార్యదర్శి వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.