మెదక్ టౌన్, వెలుగు : విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని అడిషనల్కలెక్టర్నగేశ్ సూచించారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని వెస్లీ హైస్కూల్లో నిర్వహించిన జిల్లా ఇన్స్పైర్, సైన్స్ఫెయిర్ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు విజ్ఞాన శాస్త్రాన్ని వంట పట్టించుకొని కొత్త ఆవిష్కరణలకు బీజం వేయాలన్నారు.
అనంతరం విజేతలైన 50 మంది విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు, గైడ్ టీచర్లకు పార్టిసిఫికేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు. మొదటి స్థానం పొందిన విజేతలు రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటారు. కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్, డీఈవో విజయ, డీఎస్వో రాజిరెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఎంఈవోలు, గైడ్ టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
