‘అజోల్లా’తో రైతులకు అధిక లాభాలు : అడిషనల్ కలెక్టర్ విద్యాచందన

‘అజోల్లా’తో రైతులకు అధిక లాభాలు : అడిషనల్ కలెక్టర్ విద్యాచందన

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : పశువుల మేత కొరత తీర్చేందుకు అజోల్లా పిట్ లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ విద్యాచందన రైతులకు సూచించారు. శుక్రవారం అబ్బుగూడెం, మర్రిగూడెం, అన్నపురెడ్డిపల్లి, గ్రామల్లో ఆమె పర్యటించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ఆఫీసుల పరిధిలో నిర్మిస్తున్న  ఇంకుడు గుంతలు, క్యాటిల్ షెడ్ల ను పరిశీలించి పలు సూచనుల చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఎంపీడీఓ మహాలక్ష్మి,  ఎంపీఓ షబ్నా, ఏపీఓ ప్రమీల, జీపీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.