V6 News

వరంగల్ సిటీని  ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలి : అడిషనల్ డీజీపీ చారు సిన్హా 

వరంగల్ సిటీని  ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలి : అడిషనల్ డీజీపీ చారు సిన్హా 

గ్రేటర్​ వరంగల్​, వెలుగు:   వరంగల్ నగరాన్ని ప్రమాదరహితంగా తీర్చిదిద్దడంలో రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర అదనపు డీజీపీ చారు సిన్హా, వరంగల్ సీపీ  సన్‌‌‌‌ప్రీత్ సింగ్,  కలెక్టర్లు   సత్యశారద దేవి,  చాహత్ బాజ్ పాయి అన్నారు. గురువారం హనుమకొండలోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్‌‌‌‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారు పాల్గొన్నారు. ‘ప్రజాపాలన - ప్రగతి’ ప్రణాళికలో భాగంగా ఈ నెల 13 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులతో రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.   విజేతలకు  బహుమతులు అందజేశారు.