V6 News

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా రాజీనామా

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా రాజీనామా

ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందడంతో.. ఆ పార్టీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా పార్టీకి రాజీనామా చేశారు. ఓటమికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆదేశ్ గుప్తా రాజీనామాకు బీజేపీ అధిష్టానం ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ఉపాధ్యాక్షుడిగా ఉన్న వీరేంద్ర సచ్‌దేవను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు.  ఇక.. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఆయన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతారని తెలిపింది. బీజేపీ ఢిల్లీ యూనిట్‌ చీఫ్‌గా 2020 జూన్‌లో ఆదేశ్ గుప్తా నియామకమయ్యారు. 

15 ఏళ్ల రికార్డు బ్రేక్ 

హస్తినలో 15 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ... ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో మెజారిటీకి 126 సీట్లు కావాల్సి ఉండగా.. కేజ్రీవాల్‌ పార్టీకి 134 స్థానాలు వచ్చాయి. బీజేపీ 104 సీట్లతో ఆగిపోయింది. మెజారిటీ సాధించకపోయినప్పటికీ... మేయర్‌ ఎన్నికకు బీజేపీ పోటీ పడతుందని వాదనలు వినిపించాయి. అయితే ఆ వాదనలను ఆదేశ్ గుప్తా కొట్టి పారేశారు. మేయర్‌ పదవి ఆప్‌ చేపడుతుందని, బీజేపీ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.