అయోధ్య రాముడిని నల్లగా మార్చారు : ఆదేశ్ సింగ్ చౌహాన్

అయోధ్య రాముడిని నల్లగా మార్చారు : ఆదేశ్ సింగ్ చౌహాన్
  • ఉత్తరాఖండ్ అసెంబ్లీ లో ఎమ్మెల్యే ఆదేశ్ సింగ్ చౌహాన్ కామెంట్

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుపై చర్చ సందర్భంగా అయోధ్య బాల రాముడి విగ్రహం రంగు గురించి కాంగ్రెస్​ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సభ్యుల నినాదాలతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. బుధవారం అసెంబ్లీలో పుష్కర్​సింగ్​ధామీ సర్కారు పెట్టిన యూసీసీ బిల్లుపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా జస్పూర్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదేశ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ‘‘మేము కూడా అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని స్వాగతిస్తున్నాం. కానీ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే.. రాముడు చామనచాయ రంగులో ఉంటాడని పుస్తకాల్లో చదివాం. కానీ మీరు మా రాముడిని నల్లగా మార్చారు”అని అన్నారు.

ఎమ్మెల్యే వ్యాఖ్యలను బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాముడిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని చౌహాన్‌‌‌‌‌‌‌‌ను మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్ ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలు జై శ్రీరామ్ నినాదాలు చేయడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య అసెంబ్లీలో పెద్ద దుమారానికి దారి తీసింది.