ఆదిలాబాద్ జిల్లాలో ఆరోగ్య పాఠశాల రెండో విడత ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లాలో ఆరోగ్య పాఠశాల రెండో విడత ప్రారంభం

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: విద్యార్థుల భవిష్యత్​కు బలమైన పునాదులు వేసేందుకే జిల్లాలో ఆరోగ్య పాఠశాల, ఆరోగ్య కళాశాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆదిలాబాద్​కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం పట్టణంలోని రణదివే నగర్​జడ్పీ హైస్కూల్​లో రెండో విడత ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని కలెక్టర్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరు సూత్రాలపై రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సంవత్సరం జిల్లాలో 251 స్కూళ్లు, కాలేజీల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, దీని ద్వారా విద్యార్థులకు శారీరక, మానసిక, ఆహార సంబంధిత ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామన్నారు.

మొబైల్ వాడకంతో వచ్చే అనారోగ్య సమస్యల గురించి విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్​ఆలోచింపజేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లు, సానిటరీ నాప్కిన్ మెషీన్ ను కలెక్టర్​ప్రారంభించి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్, హెచ్ఎం లక్ష్మణ్, లీడ్​బ్యాంక్​మేనేజర్ రాంచందర్ రావు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గంగాసాగర్, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం​

జైనథ్ ​మండల కేంద్రంలోని కేజీబీవీని కలెక్టర్​రాజర్షి షా గురువారం తనిఖీ చేశారు. స్కూల్​పరిసరాలు, కిచెన్​ను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని ఆదేశించారు. స్టూడెంట్లతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.