ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు, సంఘాలు, దివ్యాంగులు, నాయకుల చేసిన ధర్నాలతో ఆదిలాబాద్ కలెక్టరేట్ఆవరణ దద్దరిల్లింది. స్ర్తీ శిశు సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగుల శాఖను వేరు చేసి తమకు సంక్షేమ ఫలాలు అందించాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగులు ఆందోళన చేశారు. 2022లో శాఖను వేరు చేస్తూ జీవో నంబర్34 విడుదలై మూడేళ్లు గడిచినా చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు చెల్లించాలని డిమాండ్చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఆదివాసీ మహిళకు న్యాయం చేయాలని డిమాండ్చేస్తూ ఆదివాసీ సంఘం నాయకులు ధర్నా చేశారు.
