నెట్వర్క్, వెలుగు: తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను, భావోద్వేగాలను గౌరవించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన వ్యక్తి సోనియా గాంధీ అని ఆదిలాబాద్డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్అన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఆదిలాబాద్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు.
సోనియా గాంధీ ఎప్పుడూ బలహీన వర్గాలు, మహిళలు, యువత, రైతులు, కార్మికుల కోసం పనిచేశారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ సోయం బాపురావు, డీసీసీబీ చైర్మన్ భోజరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిత్ ఖాన్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, సంజీవరెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మల్లేశ్తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరిరావు అన్నారు.
మామడ మండలం పొన్కల్‌లో గ్రామస్తులతో కలిసి వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల, కాంగ్రెస్ కార్యాలయాల్లో నేతలు కేకులు కట్‌చేసి వేడుకలు చేసుకున్నారు. చెన్నూర్, ఖానాపూర్ లోని లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల్లో కాంగ్రెస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు.

