పోలీస్ అమరుల త్యాగాన్ని గుర్తించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

పోలీస్ అమరుల త్యాగాన్ని గుర్తించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: పోలీస్​అమరుల త్యాగాన్ని గుర్తించాలని, జిల్లాలో ప్రస్తుత ప్రశాంతతకు వారే కారణమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్​పట్టణంలో నిర్వహించిన 5కె రన్ ను ఆయన ప్రారంభించారు.  

ఇందిర ప్రియదర్శిని స్టేడియం నుంచి ప్రారంభమైన రన్​ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. దాదాపు 1,500 మంది యువత, పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్పీ స్వయంగా 5 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. ఏఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్ రెడ్డి, ఇంద్రవర్ధన్, హసీబుల్ల, పట్టణ సీఐలు, ఎస్సైలు, విద్యార్థులు పాల్గొన్నారు.

పోలీస్​ అమరుల త్యాగాలు మరువలేనివి

బెల్లంపల్లి, వెలుగు: పోలీస్​అమరుల త్యాగాలు మరువలేనివని బెల్లంపల్లి వన్​టౌన్​ఎస్​హెచ్ వో శ్రీనివాసరావు అన్నారు. పోలీస్​అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పోలీసు స్టేషన్​లో  ఓపెన్​హౌస్​నిర్వహించారు. పోలీసుల విధులు, కేసులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎస్సై రాకేశ్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.