V6 News

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ లో వడ్డీ వ్యాపారుల ఇండ్లలో తనిఖీలు..15 మందిపై కేసులు

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ లో వడ్డీ వ్యాపారుల ఇండ్లలో తనిఖీలు..15 మందిపై కేసులు

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని వడ్డీ వ్యాపారుల ఇండ్లపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. ఎస్పీ అఖిల్‌‌‌‌‌‌‌‌ మహాజన్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలతో 45 స్పెషల్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌ 16 మండలాలకు చెందిన వంద మంది వడ్డీ వ్యాపారుల ఇండ్లను తనిఖీ చేశారు. 15 మంది వ్యాపారుల నుంచి ప్రామిసరీ నోట్లు, చెక్కులు, పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌, బాండ్‌‌‌‌‌‌‌‌ పేపర్స్‌‌‌‌‌‌‌‌, సేల్‌‌‌‌‌‌‌‌ డీడ్స్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఖుర్షీద్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన నాయిని సుదర్శన్‌‌‌‌‌‌‌‌, దేవాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన కటకం రాజు, శ్రీనివాస్, 170 కాలనీకి చెందిన కుంటి లింగన్న, మావలకు చెందిన దుర్గారెడ్డి, తేజపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన గంగారెడ్డి, నేరడిగొండకు చెందిన శ్రీనివాస్, రాహుల్స, కప్పర్లకు చెందిన నగేశ్‌‌‌‌‌‌‌‌, గంభీర్, మన్నూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన గోతి సుందర్‌‌‌‌‌‌‌‌ సింగ్, గిట్టే మారుతి, కడం సుదర్శన్, కడం సాయి కృష్ణ సిద్ధాంత్, దహాలే పవన్‌‌‌‌‌‌‌‌పై కేసులు నమోదు చేశారు. అధిక వడ్డీలతో ప్రజలను ఇబ్బంది పెట్టే వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్‌‌‌‌‌‌‌‌ మహాజన్‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు.