V6 News

Nagoba Jatara: మహాపూజకు సర్వం సిద్ధం.. నాగోబా జాతరలో కీలక ఘట్టం

Nagoba Jatara: మహాపూజకు సర్వం సిద్ధం.. నాగోబా జాతరలో కీలక ఘట్టం

ఆదిలాబాద్: ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ లో నాగోబా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇవాళ రాత్రికి జాతరలో  కీలకమైన మహాపూజలు నిర్వహించేందుకు మెస్రం వంశీయులు సిద్ధమయ్యారు. గంగా జలాన్ని, ఆలయ ప్రాంగణంలోని మురాడి వద్దకు మెస్రం వంశీయులు తీసుకొచ్చారు. గ్రామంలోని పాత ఆలయం నుంచి నాగోబా విగ్రహాన్ని ఊరేగింపుగా గర్భగుడిలో ప్రతిష్టించారు. అనంతరం ఆలయ సమీపంలోని కోనేరు నుంచి మట్టి కుండల్లో నీటిని తీసుకువచ్చి పుట్టలు తయారు చేయనున్నారు.

అర్ధరాత్రి 11:30 సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జాతర ప్రారంభం కానుంది. పూజా కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు మెస్రం వంశీయులు పాల్గొంటారు. ఐదు రోజులపాటు జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు.

ALSO READ | జ్యోతిష్యం: మకరరాశిలో త్రిగ్రాహి యోగం : సూర్యుడు, చంద్రుడు, బుధుడు కలయిక .. ఐదు రాశుల వారికి ధనయోగం.. రాజయోగం