మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో శ్రీకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. సీనియర్ నటి జయసుధ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. బుధవారం ఆమె పాత్రను పరిచయం చేస్తూ క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో ఆమె సుశీలమ్మ అనే పాత్రను పోషిస్తున్నారని, ప్రేమానురాగాలు పంచే ఈ అమ్మమ్మ పాత్ర ప్రేక్షకుల మనసుకి హత్తుకోనుందని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
