
- ప్రజలను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్‌మహాజన్ హెచ్చరించారు. నెల రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడిన 160 బైక్‌ల మోడిఫైడ్ సైలెన్సర్లను ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు 2 టౌన్ పోలీస్‌స్టేషన్ ముందు మంగళవారం రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేయించారు.
ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు, యూత్ మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించినా, భారీ సౌండ్స్ వచ్చేలా ఏర్పాట్లు చేసినా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ –1989 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బైక్‌కు మోడిఫైడ్సైలెన్సర్లను బిగించవద్దని మెకానిక్ లకు సూచించారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు సునీల్ కుమార్, కరుణాకర్ రావు, ప్రణయ్ కుమార్, ఎస్ఐలు మహేందర్, దేవేందర్, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.