డివోషనల్‌‌‌‌‌‌‌‌ కంటెంట్‌‌‌‌‌‌‌‌తో ఆదిపర్వం

డివోషనల్‌‌‌‌‌‌‌‌ కంటెంట్‌‌‌‌‌‌‌‌తో ఆదిపర్వం

మంచు లక్ష్మి, ఎస్తేర్, ఆదిత్య  ఓం,  శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో సంజీవ్ మేగోటి రూపొందించిన చిత్రం ‘ఆదిపర్వం’.  ఈనెల 8న సినిమా విడుదల సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.  నిర్మాత ప్రసన్నకుమార్ అతిథిగా హాజరై,  సినిమా పెద్ద విజయం సాధించాలని బెస్ట్ విషెస్ చెప్పారు. ఆదిత్య ఓం మాట్లాడుతూ ‘హనుమంతు అనే కీరోల్ చేశా. ప్రేక్షకులు థ్రిల్ అయ్యే యాక్షన్, డివోషనల్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి’ అన్నాడు. 

ఇందులో క్షేత్రపాలకుడి పాత్ర పోషించినట్టు శివ కంఠమనేని చెప్పారు. డైరెక్టర్ మాట్లాడుతూ ‘మొదట తెలుగు,  కన్నడ  భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. వారం తర్వాత తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తాం.  గ్రాఫిక్స్, యాక్షన్ ఆకట్టుకుంటాయి. మంచు లక్ష్మి గారికి పేరు తెచ్చే చిత్రం అవుతుంది’ అని చెప్పాడు.  నటులు జెమినీ సురేష్, వెంకట్ రెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ బేబక్క, సోనియా ఆకుల తదితరులు పాల్గొన్నారు.