ఆదిపురుష్.. 10 వేల టికెట్లు ఫ్రీ

ఆదిపురుష్.. 10 వేల టికెట్లు ఫ్రీ

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను ఫ్రీగా చూసేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాధాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు  పదివేల ప్లస్ టికెట్లను ఉచితంగా ఇస్తామని ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు.

దీనికోసం  గూగుల్ ఫామ్ నింపితే టికెట్లు నేరుగా మేము పంపిస్తామని అభిషేక్ అగర్వాల్ వెల్లడించారు.  " శ్రీరాముని ప్రతి అధ్యాయం  మానవాళికి ఒక పాఠం, ఈ తరం ఆయన గురించి తెలుసుకోవాలి.  ఆయన అడుగుజాడలను అనుసనరించాలి... జై శ్రీరామ్ కీర్తనలు నలువైపులా ప్రతిధ్వనించాలి"  అని ఆయన ట్వీట్ చేశారు.  

రామయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం  భారీ అంచనాల నడుమ 2023 జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, కృతిసనన్ సీతగా నటించింది. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.