SSRMB Movie: రాజమౌళి సినిమాలో అవకాశం దక్కించుకున్న హనుమంతుడు? ఫోటో వైరల్

SSRMB Movie: రాజమౌళి సినిమాలో అవకాశం దక్కించుకున్న హనుమంతుడు? ఫోటో వైరల్

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ లెవల్లో హాలీవుడ్ రేంజ్ లో రానున్న ఈ సినిమాను టాలీవుడ్ సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న  మరో న్యూస్ వైరల్ అవుతోంది. 

అదేంటంటే.. ఈ సినిమాలో మరాఠీ నటుడు దేవ్‌దత్తా నాగే నటించనున్నాడట. ఈ నటుడు ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ సినిమాలో హనుమంతుంది పాత్రలో కనిపించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. సినిమాలో ఆయన పాత్రకి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ నటుడు అశోక్ గల్లా హీరోగా వస్తున్న దేవకినందన వాసుదేవ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన దేవ్‌దత్తా నాగే రాజమౌళిని కలిశాడట. ఆ సమయంలో తీసుకున్న ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు దేవ్‌దత్తా నాగే. దాంతో ఆ ఫోటో కాస్తా వైరల్ గా మారింది. ఇక అప్పటినుండి దేవ్‌దత్తా నాగే రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. 

అయితే.. ఈ విషయంపై మేకర్స్ నుండి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక రాజమౌళి, మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. హాలీవుడ్ రేంజ్ వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాలో విదేశీ నటులు కూడా నటించే అవకాశం ఉంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథను అందిస్తుండగా.. ఆయన అన్న ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ ఎవరు నటించనున్నారు అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. మరి ఇన్ని ప్రత్యేకతల మధ్య వస్తున్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాదిస్తుందో చూడాలి.