
శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్ మూవీలో కృతిసనన్ సీతాదేవిగా నటిస్తోంది. రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతునిగా దేవదత్తా కనిపించనున్నారు. జూన్ 16న సినిమా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో స్పీడు పెంచిన టీమ్, ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో, జూన్ 6న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులుగా ఎవరెవరు హాజరవుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది.
ఇక ఈ సినిమా సంగీత దర్శకుల్లో ఒకరైన అతుల్.. ఏకంగా ముంబై నుంచి బైక్ లో ప్రయాణించి తిరుపతి చేరుకోనున్నాడు. తిరుపతి చేరుకున్నాక అజయ్‌తో కలిసి వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద జైశ్రీరామ్ పాటను సమర్పించనున్నట్టు చెప్పారు. ఇక ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసిన ‘బాహుబలి’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా తిరుపతిలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి తిరుపతిలో ప్రభాస్ సినిమా ఈవెంట్ జరగబోతుండడంతో.. అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీ సిరీస్, రెట్రోఫిల్స్ సంస్థలతో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో త్రీడీలో విడుదల కానుంది.