కామాఖ్యతో దర్శకుడిగా.. అదిరే అభి

కామాఖ్యతో దర్శకుడిగా.. అదిరే అభి

‘జబర్దస్త్’ షోతో మంచి ఫేమ్ తెచ్చుకున్న అదిరే అభి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తను డైరెక్ట్ చేస్తున్న చిత్రానికి ‘కామాఖ్య’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించాడు.  మిస్టీరియస్  థ్రిల్లర్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలియజేశాడు. సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ఆనంద్, శరణ్య ప్రదీప్, ధనరాజ్, రాఘవ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

డివైన్ వైబ్‌‌‌‌‌‌‌‌తో ఉన్న ఈ మూవీ టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. గ్యానీ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు.