
ప్రస్తుతం కోలీవుడ్‌లో అదితి శంకర్(Adithi Shankar) హవా నడుస్తోంది. ఇటీవల శివకార్తికేయన్‌తో ఆమె నటించిన మహావీరుడు మంచి హిట్టందుకుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తెగా ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఒకప్పటి యూత్ సెన్సేషనల్ సినిమా 7G బృందావన్ కాలనీ రీమేక్‌లో అదితి పేరు వినిపిస్తోంది. మరో రెండు క్రేజీ ఆఫర్లు కూడా ఈ హీరోయిన్ చేతిలో ఉన్నాయి.
అయితే, ఇవన్నీ ఆమె ట్యాలెంట్ చూసి కాదని తన తండ్రి ఫేం వాడుకుంటోందనే టాక్ కూడా ఉంది. నటనతోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోతుందని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ ఈ నెటిగివిటీని ఏమాత్రం పట్టించుకునేట్టు కనిపించడం లేదు. వరుస ఫొటో షూట్లతో నెట్టింట సందడి చేస్తోంది. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌పై త్వరలోనే అనౌన్స్మెంట్ ఇవ్వనుంది.
ఈ మూవీలో అదితి శంకర్, ఇవనా లతో ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరిలో ఒకరిని ఈ సినిమాగా కోసం తీసుకునే అవకాశం ఉంది. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు 7G బృందావన్మూవీకి సీక్వెల్ రావడం విశేషం.