ఆదిత్య ఎల్ 1 సక్సెస్ ఫుల్గా పనిచేస్తోంది.. తొలిసారి సూర్యుని ఫుల్ డిస్క్ ఫొటోలను పంపింది

ఆదిత్య ఎల్ 1  సక్సెస్ ఫుల్గా పనిచేస్తోంది.. తొలిసారి సూర్యుని ఫుల్ డిస్క్ ఫొటోలను పంపింది

బెంగళూరు: సూర్యుని అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1  సమర్థవంతంగా పనిచేస్తోంది. ఆదిత్య ఎల్ 1 బోర్డులోని సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్(SUIT) పరికరం  సూర్యుని మొదటి పూర్తి డిస్క్ చిత్రాలను విజయవంతంగా  క్యాప్చర్ చేసింది. ఈ పరికరం 200-400 nm తరంగ ధైర్యం పరిధిలో ఈ చిత్రాలను తీసింది. 

ఈ చిత్రాలు అయస్కాంతీకరించబడిన సౌర వాతావరణం డైనమిక్ కలయికను అధ్యయనం చేయడంలో  శాస్త్రవేత్తలకు సాయ పడతాయి. భూమి వాతావరణంపై సౌర వికిరణం  ప్రభావాలపై గట్టి హద్దులు ఉంచడంలో వారికి సహాయ పడతాయని ఇస్రో వెల్లడించింది. 

SUIT వివిధ రకాల శాస్త్రీయ ఫిల్టర్లను ఉపయోగించి ఈ తరంగధైర్యం పరిధిలో సూర్యుని ఫొటోస్పీయర్, క్రోమోస్పియర్ చిత్రాలను సంగ్రహిస్తుంది. SUIT తన పనిని నవంబర్ 20 న ప్రారంభించింది. ప్రీ కమిషన్ దశ తర్వాత టెలిస్కోప్ డిసెంబర్ 6న దాని మొదటి లైట్ సైన్స్ చిత్రాలను క్యాప్చర్ చేసిందని ఇస్రో తెలిపింది. 

11 వేర్వేరు ఫిల్టర్లను ఉపయోగించి తీయబడిన ఈ ఫొటోలు అద్భతమైని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ఇతర అబ్జర్వేటరీఅల నుంచి అధ్యయనం చేయబడిన Ca II h ( క్రోమోస్పిరిక్ ఉద్గారానికి సంబంధించినది) మినగా 200-400 nm తరంగ ధైర్ఘాలలో సూర్యుని మొట్టమొదటి పూర్తి డిస్క్ ఈ చిత్రాలలో ఉన్నాయని ఇస్రో తెలిపింది.