
బాలీవుడ్ అయినా..టాలీవుడ్ అయినా..కలిసి నటించినా..నటించకపోయినా..ఎక్కడో ఓ చోట..ఎప్పుడో ఓ సందర్బంలో నటీనటులు ప్రేమలో పడిపోతుంటారు. అయితే అభిమానుల కంటపడకుండా..మీడియాకు చిక్కకుండా తమ ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్గా కొనసాగిస్తుంటారు. అయినా కొన్ని సందర్భాల్లో బయటపడిపోయి..మీడియాకు రెడ్ హ్యాండెడ్గా చిక్కుతారు. తాజాగా అలాంటి ఓ ప్రేమ జంట మీడియా కంటపడింది. బాలీవుడ్లో ఇన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా లవ్వాట ఆడుతున్న బాలీవుడ్ లవర్ బాయ్ ఆదిత్యా రాయ్ కపూర్, అనన్య పాండే బండారం బయటపడింది. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు...ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఎక్కడ చక్కర్లు కొడుతున్నారంటే..
ఆదిత్యా రాయ్ కపూర్, అనన్య పాండే స్పెయిన్లో ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. అక్కడ అందమైన లొకేషన్లను ఎంజాయ్ చేస్తున్నారు. ఓ బ్రిడ్జిపై తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫోటోల్లో వీరిద్దరు క్లోజ్ గా ఉండటం గమనించవచ్చు. ఓ స్టిల్ లో ఏకంగా ఆదిత్య అనన్యను గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీంతో బాలీవుడ్ లో కొత్త ప్రేమ జంట అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రేమలో ఉన్నట్లు వార్తలు..
ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండేలు ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. వీటిపై ఇద్దరు కూడా స్పందించలేదు. ఖండించలేదు. దీనికి తోడు పలు మార్లు ఆదిత్య అంటే తనకు ఇష్టమని..అతడి లుక్స్ బాగుంటాయని అనన్య తెలిపింది. అంతేకాకుండా పలు పార్టీలకు కలిసి వెళ్లడం..క్లోజ్ గా మాట్లాడుకోవడంతో వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారని పుకార్లు వచ్చాయి. అయితే వాటన్నింటికి తాజాగా లీకైన ఫోటోలు బలం చేకూర్చాయి.
ఆషిఖి 2తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు ఆదిత్యారాయ్ కపూర్... ఆ తర్వాత ఓకే జాను, డియర్ జిందగీ, రాష్ట్ర కవచ్ ఓం వంటి సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మెట్రో ఇన్ దినో చిత్రంలో నటిస్తున్నాడు. అటు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనన్యపాండే.. 2022లో లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ప్రస్తుతం రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని, డ్రీమ్ గర్ల్ 2, కంట్రోల్ వంటి సినిమాల్లో నటిస్తోంది.