కడెం,వెలుగు: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఆదివారం ఉదయం 11 గంటలకు ఉట్నూర్ పట్టణంలో నిర్వహించే ధర్మ యుద్ధం మహాసభకు తరలిరావాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర భీమయ్య కోరారు. కడెంలో శుక్రవారం జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల ముత్తన్న, మండల నాయకులు దూస లక్ష్మయ్య, కంతి రవీందర్, చీమల గంగన్నతో కలిసి సంబంధిత వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
లంబాడీలు రాజస్థాన్ నుంచి ఉప్పు అమ్ముకోవడానికి తెలంగాణకు వలస వచ్చారని, ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని, ఆదివాసీ తెగలలో అతిపెద్ద తెగగా అవతరించారని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1976లో జీవో నంబర్ 149 ద్వారా వీరికి ఎస్టీ హోదా ఇచ్చారన్నారు. లంబాడీలను రాజస్థాన్, మహారాష్ట్రలో మాదిరిగా ఇక్కడా బీసీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
