ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

తిర్యాణి, వెలుగు : ఆదివాసీ, గిరిజనులు అన్ని రంగాలలో రాణించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆదివారం మండలంలోని మంగి గ్రామంలో భీం వర్ధంతి నిర్వహించారు. ఎమ్మెల్యే భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా మండలంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. అనంతరం దండారి గుస్సాడీ ఉత్సవాల  చెక్కులను నిర్వాహకులకు పంపిణీ చేశారు. కార్యక్రమం లో జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ జగదేశ్, పీఏసీఎస్​చైర్మన్ శ్రీనివాస్, ఎంపీవో జావీద్, ఏటీడబ్ల్యూ క్షేత్రయ్య, సర్పంచ్ సోంబాయి, సీఐ నరేందర్, వివిధ సంఘాల లీడర్లు మొహపత్ రావు, శంకర్, ఆత్రం వినోద్, గణపతి, మోతిరాం, కమల 
తదితరులు పాల్గొన్నారు.

84 వారాలుగా అన్నదానం 

ఆదిలాబాద్, వెలుగు: సంగెం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం 84 వారాలకు చేరుకుంది. ఆదివారం స్థానిక బస్టాండ్ ఎదుట ట్రస్టు చైర్మన్, లాయర్​ సుధీర్ కుమార్ అన్నదానం చేశారు. ప్రతి ఆదివారం ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం సంతోషంగా ఉందని సుధీర్​కుమార్​ పేర్కొన్నారు. 

వేములవాడకు బస్సు సర్వీస్​ప్రారంభం 

నిర్మల్, వెలుగు:  నిర్మల్  నుంచి వేములవాడ వెళ్లేందుకు కొత్తగా బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ డిపో  మేనేజర్ సాయన్న తెలిపారు. ఈ మేరకు ఆదివారం పచ్చజెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజర్ సాయన్న మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 9గంటలకు నిర్మల్ నుంచి బయలుదేరి ఆర్మూర్ లోని సిద్దిలగుట్ట, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం  మీదుగా  రాత్రి 7:45 గంటలకు వేములవాడకు  చేరుకుంటుందన్నారు. కార్య క్రమంలో అసిస్టెంట్ మేనేజర్ లు రాజశేఖర్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.

కేజీబీవీలో శానిటేషన్​పై శ్రద్ధపెట్టాలి 

దండేపల్లి, వెలుగు: కేజీబీవీల్లో శానిటేషన్​పై శ్రద్ధ పెట్టాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్​నాయక్​అన్నారు. ఆదివారం దండేపల్లి మండల కేంద్రంలో కేజీబీవీని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.వారికి పాఠాలు చెప్పారు. అనంతరం వసతి గృహం, కిచెన్ రూమ్ ను పరిశీలించారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని, శానిటేషన్ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని ​సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట కేజీబీవీ ఇన్​చార్జి స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీ, కేజీబీవీ సిబ్బంది ఉన్నారు.

ఉద్యమ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

 బెల్లంపల్లి, వెలుగు:  అమరవీరుల ఉద్యమ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎంసీపీ(యూ) పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని  కొత్త బస్టాండ్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే  మద్దికాయల ఓంకార్  వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా  ఓంకార్ ఫొటోకు కృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  బిహార్ రాష్ట్రం ముజఫర్ పూర్ పట్టణంలో నవంబర్ 12 నుంచి 15 వరకు జరిగే ఎంసీపీ(యూ) జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో  లీడర్లు సబ్బని రాజేంద్రప్రసాద్, ఆరెపల్లి రమేశ్, రాజన్న, ఆకాశ్, శేఖర్, విజయలక్ష్మి పాల్గొన్నారు. 

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం  చేయాలి 

రామకృష్ణాపూర్, వెలుగు: పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు  కలవేని శంకర్​ పిలుపునిచ్చారు. ఆదివారం రామకృష్ణాపూర్​లోని పార్టీ ఆఫీస్​లో సీపీఐ  పట్టణ కౌన్సిల్​ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఫెయిలయ్యాయని ఆరోపించారు. రామకృష్ణాపూర్​లో అప్పటి సీపీఐ ప్రజాప్రతినిధులు చేసిన అభివృద్ధే కనిపిస్తోందన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజాపోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ లీడర్లు శ్రీనివాస్, కిష్టయ్య, సత్యనారాయణ, పౌల్​, వెంకటస్వామి, సంపత్, సాంబయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

యువకుడిపై పోక్సో కేసు 

ఖానాపూర్, వెలుగు:  ఖానాపూర్  పట్టణంలో బాలికను వేధిస్తున్న యువకునిపై పోక్సో కేసు ఫైల్​అయింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ చేసి ఆదివారం యువకుని కేసు ఫైల్​చేసినట్లు  ఎస్సై ఆర్.శంకర్ తెలిపారు.

రజకులపై సర్కార్ వివక్ష

నిర్మల్, వెలుగు:  రాష్ట్ర  ప్రభుత్వం  రజకులపై వివక్ష చూపుతోందని  రజక సంఘం  జిల్లా అధ్యక్ష,  ప్రధాన కార్యదర్శులు  చందుల ఉషన్న, సంకట పోశెట్టి, వర్కింగ్ ప్రెసిడెంట్ సట్ల శంకర్ ఆరోపించారు. ఆదివారం టీఎన్జీవో  భవన్ లో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ  సమావేశంలో  వారు  మాట్లాడుతూ బీసీ–ఏ జాబితాలో ఇతర కులాలను చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం కరెక్ట్​కాదన్నారు. దీని ద్వారా రజకులకు అన్యాయం జరుగుతుందన్నారు. రజకులను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు మంచి కంటి రవి, పోశెట్టి, సట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మునుగోడులో బీజేపీదే గెలుపు

బెల్లంపల్లి, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీదే గెలుపని మంచిర్యాల జిల్లా పార్టీ జనరల్​సెక్రటరీ మునిమంద రమేశ్​పేర్కొన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గం సంస్థాన్​ నారాయణపూర్​ మండలంలో గడపగడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రమేశ్​మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రచారంలో  జిల్లా లీడర్లు మూదం మల్లేశ్,  శ్రీనివాస్, అరవింద్, సునీల్, సాయి చక్రవర్తి, దేవేందర్ పాల్గొన్నారు.

టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలి 

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలోని టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని తపస్​ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేశ్​ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. మంచిర్యాలలో ఆదివారం తెలంగాణ ప్రాంత టీచర్ల సంఘం(తపస్​)  జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రమేశ్​మాట్లాడుతూ ప్రతి స్కూళ్లో శానిటేషన్ సిబ్బందిని నియమించాలని, పెండింగ్​లో ఉన్న డీఏలను చెల్లించాలన్నారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సయింపు శ్రీనివాసరావు,  ప్రధాన కార్యదర్శిగా రవికుమార్, ఆర్థిక కార్యదర్శిగా సమ్మయ్య, ఉపాధ్యక్షులుగా భారతీ అశోక్​ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాసరావు, ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలకుడు బద్రినారాయణ పాల్గొన్నారు.

తుల్జాభవానీ పాదయాత్ర ప్రారంభం 

భైంసా, వెలుగు: లోకకల్యాణార్థం తుల్జాభవానీ పరివార్​ పాదయాత్ర చేపట్టినట్లు భైంసా పట్టణానికి చెందిన లఖన్​ భయ్యా తెలిపారు. ఆదివారం భైంసాలోని  గుజిరిగల్లీ నుంచి ఉదయం 4.30గంటలకు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర మహారాష్ట్రలోని ప్రసిద్ధ తుల్జాపూర్​ భవనీ టెంపుల్​ వరకు 310 కిలోమీటర్ల మేర నిర్వహించనున్నారు. అనసూయ పవార్​ ట్రస్ట్​ చైర్మన్ పవార్​​రామారావు పటేల్​ ఈ యాత్రలో పాల్గొన్నారు.  బెల్​తరోడ వరకు భక్తులతో కలిసి పాదయాత్ర చేశారు. 20 ఏండ్లుగా ఈ యాత్ర కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. 

ఉద్యోగ , ఉపాధ్యాయులకు అండగా ఉంటా

కాగజ్ నగర్, వెలుగు: సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి టీచర్లకు ఉందని , వారికి అన్ని విధాలా అండగా ఉంటానని సిర్పూర్(టీ) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం కాగజ్ నగర్ పట్టణంలో పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లా కౌన్సిల్ మీటింగ్​జరిగింది.  ఎమ్మెల్యే  కోనేరు కోనప్ప, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళ్ శ్రీపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు, ఇబ్బందులపై సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తోందన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీచర్ల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్న యూనియన్ తమదేనని అన్నారు. మీటింగ్​లో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎటకురి శ్రీనివాస రావు, ఆడే ప్రకాశ్, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

తాత్కాలిక బ్రిడ్జిని వారంలో కంప్లీట్ చేయాలి 

ఇటీవల కూలిన అందవెల్లి  పెద్దవాగుపై తాత్కాలిక బ్రిడ్జి నిర్మిస్తున్నామని, ఈ బ్రిడ్జి వారం రోజుల్లో కంప్లీట్ చేయాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆర్అండ్ బీ అధికారులతో కలిసి కొత్త బ్రిడ్జి సర్వే పనులను ఎమ్మెల్యే పరిశీలించి తాత్కాలిక బ్రిడ్జి పనులను ప్రారంభించారు. వారంలో తాత్కాలిక బ్రిడ్జిపై  నుంచి రాకపోకలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు

హార్ట్​ పేషంట్లు అప్రమత్తంగా ఉండాలి

ఆదిలాబాద్‌‌, వెలుగు: హార్ట్​ పేషంట్లు చలికాలంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌‌లోని యశోద హాస్పిటల్​కార్డియాలజిస్ట్‌‌ పంకజ్‌‌ జరివాల సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌‌ఆస్పత్రిలో గుండె వ్యాధులకు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు.  కార్యక్రమంలో డాక్టర్లు అభిజీత్, ఆశిష్, ప్రమోద్, మనోజ్‌‌ పాల్గొన్నారు.

ఖానాపూర్​ డివిజన్​లో కోతలు షురూ

ఖానాపూర్, వెలుగు:  ఖానాపూర్  వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో వానాకాలం సీజన్​వరి కోతలు  షురూ అయ్యా యి. సబ్ డివిజన్  పరిధిలో  బోరు బావుల కింద వేసిన దొడ్డు రకం పంట కోతలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.  కోసిన వడ్లు స్థానిక వ్యవసాయ మార్కెట్ కు రైతులు తరలించి ఆరబోస్తున్నారు. 

ఘనంగా ఛత్ పూజలు

కాగజ్ నగర్ , వెలుగు: మినీ ఇండియాగా పేరుగాంచిన కాగజ్‌‌నగర్‌‌ పట్టణంలో ఛత్ పూజలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ఎస్పీఎం గ్రౌండ్​లో నార్త్​ఇండియన్స్​ సూర్యదేవుడికి(ఛత్) పూజలు నిర్వహించారు. పారిశ్రామిక ప్రాంతమైన కాగజ్‌‌నగర్‌‌లో నార్త్​ఇండియన్స్​ ఎక్కువగా ఉంటారు. ప్రతి సంవత్సరం దీపావళి అనంతరం ఇంటిల్లిపాదీ బాగుండాలని సూర్యదేవుడికి (ఛత్) పూజలు చేస్తారు. ఇంట్లో తయారు చేసిన పిండి వంటలు, పండ్లను గంపలో పెట్టుకొని, దీపాలు, అగరువత్తీలు వెలిగించి సూర్యాస్తమయంలో 

కొలనులోని నీటిలో నిల్చొని ఈ పూజలు చేస్తారు. 

బుడగ జంగాల కాలనీలో సౌలత్​లు కల్పించాలి 

నస్పూర్, వెలుగు: నస్పూర్ మున్సిపాలిటీలోని బుడుగ జంగాల కాలనీలో రోడ్లు, కరెంట్, తాగునీరు, డ్రైనేజీ లేక కాలనీవాసులు అవస్థలు పడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లు పేర్కొన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులోని బుడుగ జంగాల కాలనీని వారు పరిశీలించారు. ఈ కాలనీలో 20 కుటుంబాలు దాదాపు 25 ఏండ్ల నుంచి నివాసముంటున్నా వారు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇప్పటికీ కరెంటు, డ్రైనేజీ, రోడ్డు లేకపోవడం దారుణమన్నారు. వర్షాల వల్ల ఇండ్లు మునిగి ప్రజలు అవస్థలు పడుతుంటే ఎమ్మెల్యే  చూసి వెళ్లారే తప్ప ఎలాంటి పనులు చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నయీమ్ పాషా, నాగేంద్ర ప్రసాద్, కె.రాజేందర్, రామ్ బాబు, 
సంపత్ పాల్గొన్నారు.