
అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘జీ2’. గూఢచారికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీని వచ్చే ఏడాది మే 1న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు సోమవారం ప్రకటించారు.
అడివి శేష్ మరో సరికొత్త మిషన్‌కి రెడీ అవుతున్నట్టుగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ యాక్షన్ ఫ్రాంచైజీతో ఇమ్రాన్ హష్మీ తెలుగు తెరపై కనిపించబోతున్నాడు. వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ సక్సెస్‌ను బేస్‌గా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 150 రోజుల పాటు, 6 దేశాల్లో షూటింగ్ చేసి, 23 భారీ సెట్లతో చిత్రీకరిస్తున్నట్టు నిర్మాతలు తెలియజేశారు.