బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ, బీ డిజైన్​లో అడ్మిషన్స్​

బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ, బీ డిజైన్​లో అడ్మిషన్స్​

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ 2023–-24 విద్యా సంవత్సరానికి జేఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏయూ, అనుబంధ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.  ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5లోగా ఆన్​లైన్​లో అప్లై చేయాలి.
కోర్సులు–సీట్లు:  బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ(అప్లైడ్ ఆర్ట్): 50, బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ(పెయింటింగ్): 35, బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ(స్కల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): 20, బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ (యానిమేషన్): 60, బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ(ఫొటోగ్రఫీ): 50, బీడిజైన్(ఇంటీరియర్ డిజైన్): 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 


సెలెక్షన్​: రాతపరీక్ష​, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,800 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.900)  చెల్లించాలి.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జూన్​ 17, 18వ తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం www.jnafauadmissions.com వెబ్​సైట్​లో  సంప్రదించాలి.