
హైదరాబాద్: ఐటీఐ విద్యనభ్యసించే వారికి శుభవార్త. హైదరాబాద్, వరంగల్ లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి TGSRTC దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్ సౌకర్యం సంస్థ కల్పిస్తుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఈ నెల 21వ తేదీలోపు https://iti.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐటీఐ విద్యనభ్యసించే వారికి శుభవార్త. హైదరాబాద్, వరంగల్ లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి #TGSRTC దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 4, 2025
మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో ప్రవేశాలు… pic.twitter.com/lsAQQUuYTh
స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ ఒక మంచి అవకాశం. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఐటీఐ కళాశాలలను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్ లోని హాకీంపేట, వరంగల్ ములుగు రోడ్ లోని ఐటీఐ కళాశాలలను నేరుగా సంప్రదించవచ్చని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీ.సీ. సజ్జనార్ ట్వీట్ చేశారు.
నిరుద్యోగ యువతకు మంచి శిక్షణ, బంగారు భవిష్యత్తు అందించడం, తక్కువ సమయంలోనే ఉపాధి కల్పించడం అనే లక్ష్యంతో ఆర్టీసీ ఈ ఐటీఐ కళాశాలలను ఏర్పాటు చేసింది. నిపుణులైన అధ్యాపకులతో పాటు అత్యంత అనుభవజ్ఞులైన అధికారులు తరగతులు నిర్వహిస్తున్నారు.
ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కావలసిన TGSRTC డిపోలలో అప్రెంటిస్‌షిప్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు పూర్తి వివరాల కోసం హైదరాబాద్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9100664452 లేదా 040-23450033, వరంగల్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9849425319 లేదా 8008136611 సంప్రదించవచ్చని తెలిపారు.