ఆ వయసు దాటితే ఏ మతాన్నయినా అవలంబించొచ్చు

ఆ వయసు దాటితే ఏ మతాన్నయినా అవలంబించొచ్చు

న్యూఢిల్లీ: యుక్త వయసులో ఉన్న వారికి తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. 18 సంవత్సరాలు పైబడిన వారికి మత మార్పిడుల విషయంలో కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం పైవ్యాఖ్యలు చేసింది.

పద్దెనిమిదేళ్లు పైబడిన వ్యక్తులు తమకు నచ్చిన మతాన్ని ఎందుకు అవలంబించొద్దో చెప్పాలని జస్టిస్ రోహిన్ తన్ ఫలీ నైర్మన్ల ధర్మాసనం పిటిషనర్ను ప్రశ్నించింది. ఇలాంటి వ్యాజ్యాలు హానికరమని, దీన్ని ముందుకు తీసుకెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో ఉపాధ్యాయ పిల్ను ఉపసంహరించుకున్నారు.