- అడ్వకేట్ ఎంఏ ఇమ్రాన్ విజ్ఞప్తి
ఖైరతాబాద్,వెలుగు: వివాదాస్పద భూమిలో నిర్మించనున్న విల్లా ప్రాజెక్ట్ నిర్మాణ పూజకు చినజీయర్‌స్వామి హాజరు కావద్దని అడ్వకేట్ ఎంఏ ఇమ్రాన్విజ్ఞప్తి చేశారు. కొంగర కలాన్పరిధి సర్వే నం. 61లోని భూమి కోర్టు వివాదంలో ఉందని, అందులో ఐరా సంస్థ ‘దిసెక్యూర్’ పేరిట విల్లా ప్రాజెక్టు నిర్మిస్తుందని, దీనికి శనివారం భూమి పూజ చేస్తుండగా చినజీయర్ స్వామిని సంస్థ ఆహ్వానించిందని పేర్కొన్నారు.
గురువారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇమ్రాన్ మాట్లాడారు. తమ క్లయింట్‌కు అగ్రిమెంట్ మేరకు ఐరా సంస్థ చెల్లించాల్సిన డబ్బు ఇవ్వలేదని, దీంతో కోర్టును ఆశ్రయించగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. భూమిపూజలో ఎలాంటి వివాదం తలెత్తకుండా ఉండేందుకు చినజీయర్ స్వామిహాజరు కావద్దని ఆయన సూచించారు.