
పేపర్ లీకేజీ కారణంగా రద్దైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) నియామక పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మే 8న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఏఈఈ ఆన్‌లైన్ పరీక్ష, మే 21న సివిల్ ఏఈఈ ఓఎంఆర్ పరీక్ష నిర్వహించినున్నట్లు వెల్లడించింది. కాగా పేపర్ లీకేజీ ఘటనతో జనవరి 22న నిర్వహించిన ఏఈఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది.