ఐపీఓకు దరఖాస్తు చేసిన .. ఆఫ్కాన్స్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్

ఐపీఓకు దరఖాస్తు చేసిన .. ఆఫ్కాన్స్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్

న్యూఢిల్లీ: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఏఐఎల్) ఐపీఓ కోసం మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి డ్రాఫ్ట్​పేపర్లను అందజేసింది. పబ్లిక్​ఇష్యూ ద్వారా రూ. 7,000 వేల కోట్లను సేకరించాలని భావిస్తోంది. ఇందులో రూ. 1,250 కోట్ల విలువైన షేర్ల తాజా ఇష్యూ ఉంటుంది.  ప్రమోటర్ గోస్వామి ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ. 5,750 కోట్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది. 

అర్హులైన ఉద్యోగులకు కొన్ని షేర్లను కేటాయిస్తారు. ప్రస్తుతం, ప్రమోటర్,  ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు మహారాష్ట్రకు చెందిన ఆఫ్కాన్స్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌లో 99.48 శాతం వాటా ఉంది. ప్రీ-ఐపీఓ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్ రౌండ్‌‌‌‌‌‌‌‌లో కంపెనీ రూ. 250 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. ఈ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్ పూర్తయితే, తాజా ఇష్యూ పరిమాణం తగ్గుతుంది.  
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ (ఎస్పీ గ్రూప్)  ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్, నిర్మాణం, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, నీరు, శక్తి,  ఆర్థిక సేవల ప్రాజెక్టులు చేపడుతోంది.  ఆఫ్కాన్స్​కు  సముద్ర  పారిశ్రామిక, ఉపరితల రవాణా, పట్టణ మౌలిక సదుపాయాలు, హైడ్రో  భూగర్భ, చమురు  వాయువు వర్టికల్స్​ఉన్నాయి. గత 10 ఆర్థిక సంవత్సరాల్లో, కంపెనీ మొత్తం 52,220 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ విలువతో 15 దేశాలలో 76 ప్రాజెక్టులను పూర్తి చేసింది.