
ముంబై: అఫ్గానిస్తాన్‌తో టీమిండియా తొలిసారి వన్డే బైలేటరల్ సిరీస్ ఆడనుంది. వచ్చే ఐపీఎల్ కంటే ముందు మార్చిలో అఫ్గానిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ ఆతిథ్యం ఇవ్వనుంది. అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) రిలీజ్ చేసిన ఎఫ్‌టీపీ ప్రకారం.. ఫిబ్రవరి, మార్చిలో అఫ్గాన్ టీమ్ మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం బంగ్లాదేశ్‌కు వెళ్తుంది. అనంతరం ఇండియా టూర్‌కు రానుంది. 2023 వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫికేషన్ ఈవెంట్ అయిన ఐసీసీ సూపర్ లీగ్‌లో భాగంగా ఇండియాతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ వన్డే సిరీస్‌లో టీమిండియా యంగ్‌స్టర్స్‌కు చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.