రషీద్‌‌‌‌‌‌‌‌కు వెన్ను సర్జరీ

రషీద్‌‌‌‌‌‌‌‌కు వెన్ను సర్జరీ

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌: అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రషీద్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ వెన్నెముకకు గురువారం సర్జరీ చేయించుకున్నాడు. దీంతో డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 7 నుంచి మొదలయ్యే బిగ్‌‌‌‌‌‌‌‌బాష్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌కు అతను అందుబాటులో ఉండటం లేదు. సర్జరీ సక్సెస్​ అయ్యిందని రషీద్​ పేర్కొన్నాడు. ఈ టైమ్​లో అండగా నిలిచిన ఫ్యాన్స్​కు కృతజ్ఞతలు చెప్పాడు. 

వీలైనంత త్వరగా గ్రౌండ్​లోకి వచ్చేందుకు ట్రై చేస్తానని చెప్పాడు. మరో వారం రోజుల్లో రిహాబిలిటేషన్​ మొదలుపెట్టనున్న రషీద్​.. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఇండియా, అఫ్గానిస్తాన్​ సిరీస్​కు అందుబాటులో ఉండే చాన్స్​ ఉంది. మరోవైపు బిగ్​బాష్​ లీగ్​ కోసం రషీద్​ ప్లేస్​లో హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌ (ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌)ను టీమ్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకున్నట్లు అడిలైడ్‌‌‌‌‌‌‌‌ స్ట్రయికర్స్‌‌‌‌‌‌‌‌  వెల్లడించింది.